బి.ఆర్.ఎస్.లో చేరిన కాంగ్రెస్ నాయకుడు..
TGW NEWS/హనుమకొండ: పరకాల నియోజకవర్గం.పరకాల మండలం వెంకటాపుర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోలినేని స్వామి రావు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బి.ఆర్.ఎస్.పార్టీలో చేరడం జరిగింది.వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.పార్టీపై నమ్మకంతో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్.నాయకులు మునిగాల సురేందర్ రావు, విజేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

0 Comments