యువత, విద్యార్థులకు మోదీ, కేసీఆర్ ద్రోహం...
TGW NEWS/సూర్యాపేట: ఈ రోజు MP కెప్టెన్ ఉత్తమ్ & మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి గార్ల ఆహ్వానం మేరకు కోదాడ ,హుజుర్నగర్ నియోజకవర్గాల NSUI, యువజన కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి & NSUI రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ , రాష్ట్ర యూత్ అధ్యక్షుడు శివ సేనారెడ్డి గారు ముఖ్య అతిధులు గా హాజరవడం జరిగింది.
యూత్ & NSUI నాయకులు, కార్యక్తలతో కోదాడలో ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీ, సభలో వేలాది మంది యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా NSUI రాష్ట్ర అధ్యక్షులు బలమూరి వెంకట్ మాట్లాడుతూ
నిరుద్యోగ యువత, విద్యార్థులకు మోదీ, కేసీఆర్ ద్రోహం చేశారని,రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని నెరవేర్చడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని,కోదాడలో అధికార పార్టీ నాయకులు గంజాయి మాఫియా నడుపుతున్నట్లు విస్తృతంగా చర్చ జరగడం దురదృష్టకరమన్నారు. రానున్న ఎన్నికల్లో రెండు నియోజకవర్గల్లో 60 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో NSUI జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్, NSUI కోదాడ&హుజుర్నగర్ నియోజకవర్గల అధ్యక్షులు గుండాల నవీన్ యాదవ్, గడ్డం రాజ శేఖర్ రెడ్డి మరియు వివిధ మండలాల NSUI కో ఆర్డినటర్లు NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు...

0 Comments