కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్‌లోకి జోరుగా చేరిక‌లు...

 కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్‌లోకి జోరుగా చేరిక‌లు...


TGW NEWS/పరకాల: గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినా ఎమ్మెల్యే చల్లా...

నిరుపేద ప్రజలకు అండగా సీఎం కేసీఆర్ సారధ్యంలో అద్భుతమైన పథకాలు అమలుచేస్తున్నారని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు. దామెరా మండలం కోగిలివాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గులాబీ గూటికి చేరారు. వారిని ఎమ్మెల్యే గారు గులాబీ కండువా కప్పి పార్టీలోని ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీని ఎదురు లేని శక్తి అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి అవుతున్నట్లు గమనిస్తున్న ప్రజా ప్రతినిధులు, నాయకులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరడానికి ఉత్సహం చూపుతున్నారని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం బిఆర్‌ఎస్ ప్రభుత్వం ద్వారనే సాధ్యం అవుతుందని నాయకులకు విశ్వాసం ఉందన్నారు.తెలంగాణ సాధించిన పార్టీ ఏదైనా సాధిస్తుందన్న నమ్మకం ప్రజలలో బలంగా ఉందన్నారు.జరుగుతున్న అభివృద్ధిని అందరూ గమనిస్తున్నారని అన్నారు. అను నిత్యం ప్రజల్లో ఉంటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాన‌న్నారు.

పార్టీలో చేరినవారు: చుక్క బాస్, ఈసంపెల్లి మొగిలి, గడ్డం రంజిత్ కుమార్, మేకల ఎల్లయ్య, చుక్క యుగెందర్, అకునూరి రవి, ఈసంపెళ్ళి శ్రీను, గడ్డం టోనీ, గడ్డం సురేందర్, మేకల కిషన్, చుక్క చిరంజీవి, చుక్క నాధం, చుక్క మొగిలి, ఈసంపెళ్లి సారంగపాణి, గడ్డం రాంచందర్, మేకల దేవేందర్, గడ్డం రమేష్, తదితరులు.

ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments