మెదక్ సృష్టించిన కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్

 మెదక్ సృష్టించిన కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్....

TGW NEWS/మెదక్: అంబేద్కర్ మల్లిఖార్జున ఖర్గే ఫోటోలకు పాలాభిషకం

కాంగ్రెస్ ఘనతను చాటిచెప్పిన పీసీసీ నేతలు చౌదరి సుప్రభాత రావు, మ్యాడం బాలకృష్ణ

అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రకటించిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చరిత్ర సృష్టించిందని *ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు చౌదరి సుప్రభాత రావు, మ్యాడం బాలకృష్ణ కొనియాడారు. ఆదివారం నాడు *జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షులు జంగర్ల గోవర్ధన్, మూడవత్ అశోక్ నాయక్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ స్వాగతిస్తూ అంబేద్కర్, మల్లికార్జున ఖర్గే చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అతిథులుగా హాజరైన *పీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతారావు, మ్యాడం బాలకృష్ణ* ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పై మాట్లాడారు. దేశంలోని అణగారిన వర్గాలకు హక్కులతో పాటు సంక్షేమ పథకాలను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని వ్యాఖ్యానించారు. దళితులు గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం భూములు ఇస్తే కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబం వాటిని లాక్కునే కార్యక్రమాన్ని మొదలు పెట్టిందని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాల ఆలోచన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి కలిగితే దానిని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమేనని వారు ప్రకటించారు. కాంగ్రెస్ ద్వారానే ఎస్సీ ఎస్టీల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందన్నారు. *బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి హఫీజ్ మొల్సాబ్ మాట్లాడుతూ కాంగ్రెస్ రైతు, యువజన, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు చారిత్రాత్మకమైనవని అన్నారు. ప్రతి అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇక ఊరురా ప్రచారం చేపడతామని వారు ప్రకటించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త డిక్లరేషన్లను గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పథకాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లే బాధ్యత ఎస్సీ, ఎస్టీ సెల్ జిల్లా బాధ్యులుగా తాము తీసుకుంటామని *జంగర్ల గోవర్ధన్ మూడవత్ అశోక్ ప్రకటించారు.* ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ గొండ స్వామి, రామాయంపేట మాజీ పట్టణ అధ్యక్షులు డాకి స్వామి, నాగిరెడ్డి, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ సల్మాన్, చిన్న శంకరంపేట్ SC సెల్ అధ్యక్షులు కడియాల మల్లేశం, చిన్న శంకరంపేట్ మండల్ ST సెల్ అధ్యక్షులు రవిచంద్ నాయక్, రామాయంపేట st సెల్ అధ్యక్షులు చందర్ నాయక్, మెదక్ మండల్ st సెల్ అధ్యక్షులు రమేష్, పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ చౌదరి, రామాయంపేట పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డాకి నాగేందర్, గుండు శ్రీనివాస్, కొండా సంజీవ్, శాంతి కుమార్, పెంట్య నాయక్, m సంజీవ్, మల్లేష్, శేఖర్, మోహన్, రాంచంద్రం, పవన్ కళ్యాణ్, విశాల్, నితిన్ రాజు, నాని తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments