తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి దరఖాస్తుల గడువు పెంచాలి...

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి దరఖాస్తుల గడువు పెంచాలి...








TGW NEWS/తెలంగాణ: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలుగా ప్రజలను మభ్యపెడుతూ రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయంఐదు లక్షల నుంచి మూడు లక్షల కుదించి దానికి కూడా దరఖాస్తు గడవు మూడు రోజులే ఇవ్వడం తీవ్ర ఆరోపణలకు తావిస్తుంది, ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే  మద్యం షాపులకు పది రోజులు సమయం ఇచ్చి పేదల ఆత్మగౌరవపు చిహ్నం రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణానికి మూడు రోజులే సమయం ఇవ్వడం ప్రభుత్వానికి ఏవరి మీద చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు గృహలక్ష్మి పథకానికి అవసరమైన సిబ్బంది లేకుండానే  ముందుకు వెళ్లడం కేవలం ఎన్నికల ఎత్తుగడగా  మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తుందని, రాబోతున్న ఎన్నికల సమయంలో సరిపడా ఎన్నికల నిర్వహణ సిబ్బంది లేకుండా ఉన్న ఈ సమయంలో ప్రజలను, అధికారులను గందరగోళంలో నెట్టి వేస్తుందని నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ గృహ లక్ష్మీ పథకానికి ఎవరి సొంత జాగాలో వారికి ఐదు లక్షల సహాయం చేయాలని, దరఖాస్తు గడువు 15 రోజుల వరకు ఇవ్వాలని ఆ వైపుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది....

Post a Comment

0 Comments