గులాబీ గూటికి యువ సైన్యం..బీ.ఆర్.ఎస్. పార్టీలో చేరగా, కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
TGW NEWS/మానకొండూర్: నియోజకవర్గం కండువాలు కప్పి ఆహ్వానించిన మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ ..మానకొండూర్ నియోజకవర్గంలోని యువ సైన్యం ఈరోజు గులాబీ గూటికి భారీగా చేరింది..శంకరపట్నం మండలం తాడికల్, ధర్మారం, చింతగుట్ట గట్టు గ్రామాల్లోని వివిధ పార్టీలకు చెందిన యువకులు రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు
డా.రసమయి బాలకిషన్ సమక్షంలో ఆహ్వానించారు
ఈ సందర్బంగా యువకులు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, అదేవిధంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు
కేసీఆర్ గారు అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు రసమయి గారు గ్రామాలలో చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులమై బీ.ఆర్.ఎస్ పార్టీలో చేరడం జరిగిందని, రానున్న ఎన్నికల్లో రసమయి గారి గెలుపు కోసం సైనికుల్లా పని చేస్తామని యువకులు స్పష్టం చేశారు..

0 Comments