Nara Lokesh: సీఎం జగన్ నొక్కే బటన్‌కు కరెంట్ లేదు: నారా లోకేశ్‌

 Nara Lokesh: సీఎం జగన్ నొక్కే బటన్‌కు కరెంట్ లేదు: నారా లోకేశ్‌

TGW NEWS/నూజివీడు: సీఎం జగన్ నొక్కే బటన్‌కు కరెంట్ లేదని.. కరెంట్ లేని బటన్ ఎన్నిసార్లు నొక్కినా డబ్బులు పడవంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు..

నూజివీడు నియోజకవర్గం ముసునూరు గ్రామస్థులతో ఆయన రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల జేబులకు చిల్లు ఎలా పొడవాలని చూసే పెత్తందారు సైకో జగన్ అంటూ లోకేశ్‌ ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో అప్రకటిత కరెంటు కోతలతో రాష్ట్రమంతా చీకట్లు అలముకున్నాయన్నారు. వ్యవసాయం, పరిశ్రమలకు కరెంటు కోతలు శాపంగా మారాయన్నారు. సైకో సీఎం చర్యలతో ఏపీ పరువు పోయిందని విమర్శించారు..

నూజివీడు ఎమ్మెల్యే కొడుకు మహా కేటు అని, నియోజకవర్గంలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, మట్టి దోపిడీనేనని లోకేశ్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారని గ్రామ సర్పంచ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ పాలనలో నిధులు, విధులు లేకుండా సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాల్లా మార్చారని మండిపడ్డారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అసలు లబ్ధిదారులను అధికార పార్టీ మోసం చేసిందన్నారు. రైతులకు 9గంటలు ఉచిత కరెంటు సరఫరా చేయట్లేదని రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు..

Post a Comment

0 Comments