బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు..
TGW NEWS/హనుమకొండ జిల్లా: పరకాల నియోజకవర్గం.బీఆర్‌ఎస్‌లోకి చేరికల పర్వం కొనసాగుతోంది.సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్నఅభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు వచ్చి గులాబీ కండువాలు కప్పుకుంటున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.ఆదివారం ఆత్మకూరు మండలం ఆగ్రంపాడ్ గ్రామానికి చెందిన బిజెపి గ్రామ అధ్యక్షులు నాంపల్లి రమేష్ గారితో పలువురు యువ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ బి.ఆర్.ఎస్.గ్రామ యూత్ అధ్యక్షులు కొత్తపల్లి నాగరాజు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బి.ఆర్.ఎస్.లో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు.
పార్టీలో చేరిన వారిలో నాంపల్లి రమెష్ తో పాటు విష్ణు వర్ధన్,మహేష్ తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు తోట కిరణ్,గంగుల అనిల్,వంశీ యాదవ్,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments