ఫోన్‌లో సిమ్ లేకుంటే వాట్సాప్, టెలిగ్రామ్ సేవలు బంద్... మార్చి నుంచి కొత్త నిబంధనలు!
వచ్చే నెలనుంచి అమల్లోకి రానున్న సిమ్ బైండింగ్ నిబంధనలు
మెసేజింగ్ యాప్‌లకు ఫిబ్రవరి 28 వరకు గడువు ఇచ్చిన కేంద్రం
వాట్సాప్ వెబ్ కూడా ప్రతి ఆరు గంటలకు ఒకసారి లాగౌట్ అవుతుంది
మార్చి 1వ తేదీ నుంచి వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లకు ఫోన్‌లలో యాక్టివ్ సిమ్ కార్డు తప్పనిసరి. ఈ యాప్స్‌కు సంబంధించిన సిమ్ బైండింగ్ నిబంధనలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధన అమల్లోకి వస్తే, సిమ్ లేకుండా మెసేంజర్ యాప్స్ ఫోన్‌లో పనిచేయవు. గత సంవత్సరం నవంబరులో ఈ నిబంధనలు ప్రకటించినప్పటికీ, వీటిని అమలు చేయడానికి ఆయా సంస్థలకు ప్రభుత్వం ఫిబ్రవరి 28 వరకు గడువు ఇచ్చింది. గడువు రేపటితో ముగియనున్నందున, ఎల్లుండి నుంచి సిమ్ లేకుంటే ఆయా యాప్స్ ఫోన్‌లో పనిచేయకపోవచ్చు. ఎవరైనా సిమ్ లేకుంటే యాప్స్ ఉపయోగిస్తుంటే కనుక ఆ ఫోన్‌లలో ఈ యాప్ నిలిచిపోతుంది. వాట్సాప్ వెబ్ కూడా ప్రతి ఆరు గంటలకు ఒకసారి లాగౌట్ అవుతుంది.


0 Comments