అంబటి రాంబాబుకు నోటీసులు...
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు వీటిని అందజేశారు. గతంలో నమోదైన ఒక కేసు విచారణలో భాగంగా ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. చట్టప్రకారం విచారణకు సహకరించాలని, నిర్దేశించిన సమయంలో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.


0 Comments