ఇంటర్ ఫలితాలలో భద్రకాళి ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థుల జయకేతనం..

ఇంటర్ ఫలితాలలో భద్రకాళి ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థుల జయకేతనం.. 

TGWNEWS/నర్సంపేట: ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో నర్సంపేటలోని భద్రకాళి ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించడం జరిగిందని కళాశాల చైర్మన్ రమేష్ అన్నారు. ఇట్టి ఫలితాలకు సంబందించి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో E.T గ్రూప్ నుండి మైదం విజయ్ కుమార్ 971/1000, MPHW(F) గ్రూప్ నుండి గణపురం శృతి 945/1000, MLT గ్రూప్ నుండి కనుగుల సాయి కిరణ్ 889/1000, ACP గ్రూప్ నుండి మేకల శివ కుమార్ 872/1000 మార్కులను సాధించడం జరిగిందని అలాగే ప్రథమ సంవత్స రంలో MPHE(F) గ్రూప్ నుండి అజ్మీరా సింధు 473/500, గన్నెబొయిన ప్రియాంక 471/500, బండి రచన 471/500, మగ్గిడి శ్రావణి 469/500, MLT గ్రూప్ నుండి పెండ్లి ప్రవర్ష 466/500, భూక్యా అస్మిత 458/500 అత్యున్నత మార్కులు సాధించడం జరిగిందని అన్నారు.ఈ విధంగా కళాశాలలో అత్యున్నత మార్కులను సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మెన్ శ్రీ గాదె రమేష్ గారు అభినందించి,విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలని మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల పిన్సిపల్ దూపటి మనోహర్, అధ్యపక బృందం నగేష్, దేవేందర్, భరత్, రచన, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments