నర్సంపేట పట్టణంలో కుల సంఘ భవనాలను నిర్మించాలి: దళిత ప్రజా సంఘాల జేఏసీ.
TGWNEWS/నర్సంపేట : నర్సంపేట పట్టణంలో కుల సంఘ భవనాలను నిర్మించాలని దళిత ప్రజా సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేసారు. పట్టణంలోని గెస్ట్ హౌస్ లో దళిత ప్రజా సంఘాల జేఏసీ కో కన్వీనర్ గుంటి వీర ప్రకాష్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి దళిత ప్రజా సంఘాల కో కన్వీనర్ దళితరత్న కల్లెపెల్లి ప్రణయదీప్ హాజరై మాట్లాడుతూ ఇటీవల కాలంలో కుల సంఘాల భవనాల నిర్మాణంలో ప్రజలను మభ్యపెట్టి కులాల మధ్యన చిచ్చు పెడుతున్నారనీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార పార్టీ నాయకుల పై విమర్శలు చేశారు .అందుకు ప్రతి విమర్శగా అధికార పార్టీ నాయకులు నర్సంపేట పట్టణ అభివృద్ధిని అడ్డుకుంటూ, కోర్టులలో కేసులు వేస్తూ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందకుండా చేస్తున్నారని ప్రతి విమర్శలు చేస్తున్నారు,గత నాలుగున్నర సంవత్సరాల నుండి కుల సంఘ భవనాల నిర్మాణం ఎప్పుడు జరుగుతుందని ఎదురుచూస్తున్న ప్రజలకు అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కుల సంఘ భవనాల నిర్మాణం విషయాన్ని ఏ రాజకీయ పార్టీ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల జేఏసీ కో కన్వీనర్ కోట డేవిడ్ ,అందే రవి, విజయ్ మైసూ శోభన్ బాబు బోయిని నారాయణ, శ్రీకాంత్, యాకూబ్ దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.


0 Comments