వైభవంగా హనుమాన్ శోభాయాత్ర...

వైభవంగా హనుమాన్ శోభాయాత్ర...

TGWNEWS/గూడూరు :  మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం దాదాపు 200 మంది హనుమాన్ భక్తులు శోభాయాత్ర నిర్వహించారు.  ఈ శోభాయాత్ర గూడూరు సర్పంచ్ నూనావత్ రమేష్ చేతుల మీదగా ప్రారంభమై లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం నుంచి  నగర వీధుల్లో సంకీర్తనలు భజనలు చేస్తూ, హనుమాన్ భక్తులు భక్తుశ్రద్ధలతో హనుమాన్ రథాన్ని గూడూరు చంద్రగూడెం గొల్లగూడెం వీధుల వెంట తిప్పుతూ వారి యొక్క భక్తి చాటుకున్నారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు జాటుతూ హుస్సేన్ నాయక్ పాల్గొన్నారు. గురుస్వాములైన బీరం శ్రీపాల్ రెడ్డి మెరుగు మల్లయ్య  ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్ర అనంతరం దేవాలయం నందు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాతలుగా ఏపూరు రవీందర్, నూనవత్ రమేష్, పానుగంటి అజయ్, అధిక సంఖ్యలో భక్తులు,గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

Post a Comment

0 Comments