కార్మికుల అండగా తెరాస ప్రభుత్వం : ఎమ్మెల్యే గండ్ర
TGWNEWS/భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పనిచేస్తూ రాష్ట్రాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తున్న కార్మికుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వేంకట రమణా రెడ్డి అన్నారు శనివారం భూపాలపల్లి మున్సిపాలిటీ కృష్ణ కాలనీలోని సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి కార్మిక ఆత్మీయ సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా లో అన్ని విభాగాల్లో ఉన్నటువంటి కార్మికులు మరి ముఖ్యంగా సింగరేణి, మున్సిపాలిటీ కార్మికులు,హమాలి, లోడింగ్ అన్లోడింగ్ కార్మికులకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ వారి యోగక్షేమాలకు అండగా ఉంటానాని ఎమ్మెల్యే గండ్ర తెలిపారు.ప్రమాదవశాత్తు మరణించిన,సాధారణ మరణం పొందిన కార్మికులకు రూ.200000/- ల చెక్కులను అందిస్తుంది, గుర్తింపు పొందిన కార్మికుడి కుమార్తెకు వివాహ ఖర్చుకు రూ 30000/-లను అందిస్తుందని గుర్తు చేశారు.ఇటీవలే ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.2లక్షల చెక్కులను లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు.నూతంగా కార్మికులుగా గుర్తింపు పొందిన కార్మికులకు హెల్త్ కార్డులను అందించారు.ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ఉత్తమ కార్మికులుగా ఎన్నికైన నర్సింగరావు, రమేష్ లను సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాలు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.


0 Comments