ఈ నెలలో కొత్త పార్లమెంటరీ భవన ప్రారంభం ఎప్పుడంటే...
TGWNEWS/న్యూఢిల్లీ :దేశ రాజధానిలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన నూతన పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఇది తుది మెరుగులు దిద్దుకుంటోందని.. మే చివరినాటికి సిద్ధమవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే, అధికారికంగా తేదీని మాత్రం నిర్ణయించలేదని తెలిపాయి. దీంతో ఈ నెల చివరి వారంలో పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధానిగా తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న దృష్ట్యా.. నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మే 26, 2014లో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ తొలిసారి బాధ్యతలు చేపట్టగా.. మే 30, 2019న రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. నూతన పార్లమెంటు భవనానికి డిసెంబర్ 2020లో ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. 64,500 చదరపు మీటర్ల పరిధిలో కొత్త పార్లమెంట్ భవనం ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులు ఉంటాయి. కొత్త పార్లమెంట్ ఎత్తు సైతం పాత భవనం అంతే ఉంటుంది. ఒకేసారి 1,224 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా దీన్ని నిర్మించారు. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. దీని నిర్మాణ వ్యయం రూ.970కోట్లు అని అంచనా..
0 Comments