ఆ ఊరి జనాలను వణికిస్తున్న దెయ్యం... భయంతో ప్రజలు...
TGWNEWS/నెల్లూరు: టెక్నాలజీ పెరుగుతున్న మూఢనమ్మకాలు మాత్రం ప్రజల్లో అలానే పాతుకుపోతున్నాయి. ఓ ఊరి జనాలను దెయ్యం భయం వణికిస్తోంది. రాత్రైతే చాలు, ప్రాణాలు అరచేతిలో పట్టుకుని గడుపుతున్నారు. చీకటి పడగానే వింత శబ్దాలు, వికృత రూపాలు కనిపింస్తున్నాయంటూ గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. కాస్త ధైర్యం చేసిన కుర్రాళ్లు రాత్రుళ్లు పహారా కాయగా.. వారికి ఓ వింత ఆకారం కనిపించింది. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లిలో గ్రామస్థులకు దెయ్యం భయం పట్టుకుంది. ఆ గ్రామంలో రాత్రిపూట దెయ్యం తిరుగుతోందని ప్రచారం జోరుగా సాగుతోంది. రాత్రిపూట వింత శబ్ధాలు వినిపిస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. అసలు ఆ కథ ఏంటో తేల్చాలని భావించిన ఆ ఊరిలోని యువకులు రాత్రులు పహారా కాయడం మొదలు పెట్టారు. అలా రాత్రిపూట పహారా కాస్తున్న యువకులకు ఆ ఊరి స్కూల్ భవనంపై ఓ నీడ కనిపించింది. అక్కడ ఎవరూ లేకపోయినా గోడ మీద నీడ ఎలా వచ్చిందో వారికి అర్థం కాలేదు. వెంటనే వారు ఆ నీడను ఫోన్ లో వీడియో తీశారు. ఆ వీడియో గ్రామస్థులకు చూపించారు. ఆ దృశ్యాలు చూసిన తర్వాత గ్రామస్థుల భయం మరింత బలపడింది. నిజంగానే వారి గ్రామంలో దెయ్యాలు తిరుగుతున్నాయని గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఇదంతా కొందరు ఆకతాయిల పనా? లేక నిజంగానే వింత శబ్ధాలు వినిపిస్తున్నాయా? అనే విషయంపై స్పష్టంగా తెలియాల్సి ఉంది.


0 Comments