కాంగ్రెస్ నాయకుడు మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపిన మురళి నాయక్..
TGWNEWS/గూడూరు : మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుర్ర నరసింహా రెడ్డి అకాలమరణంతో మృతి చెందగా మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మురళి నాయక్ బుర్ర నరసింహారెడ్డి పార్థివ దేహనికి పులమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతిని ప్రకటించారు. అయన వెంట బ్లాక్ కార్యదర్శి చిట్టె వెంకన్న,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బొల్లికొండ మధు,జిల్లా సహాయ కార్యదర్శి అర్రెమ్ వీరస్వామి, అయోధ్యపురం ఉపసర్పంచ్ కంకటి మమత ముక్తేశ్వర్ గౌడ్,మండల నాయకులు పూజారి శంకర్, అశోక్ రెడ్డి, భీమగాని శ్రీనివాస్, గూడూరు మేజర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు హెచ్చు శివ, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.


0 Comments