పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే పెద్ది..

పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే పెద్ది..

TGWNEWS/నర్సంపేట : ఆదివారం నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పలు కుటుంబాలను పరామర్శించారు. మొదట తిమ్మంపేట గ్రామానికి చెందిన BRS పార్టీ సీనియర్ నాయకులు గొళ్లేన రాజయ్య గారి తండ్రి గొళ్లేన పెద్ద బక్కయ్య  అనారోగ్యముతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి, అలాగే BRS గ్రామ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కోమాండ్ల రమణారెడ్డికి ఆక్సిడెంట్ అయిన విషయాన్నీ తెలుసుకొని ఆయనని పరామర్శించారు. అదేవిధంగా తిమ్మంపేట మాజీ సర్పంచ్ గంగాడి చెంద్రారెడ్డి  అనారోగ్యముతో ఉండగా పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుకినే రాజేశ్వర్ రావు,జడ్పీ వైస్ ఛైర్మెన్ ఆకుల శ్రీనివాస్, MPP కాట్ల కోమల భద్రయ్య, గ్రామ సర్పంచ్ మోడెం విద్యాసాగర్, మోడెం రాజమౌళి, ప్రభాకర్ రెడ్డి, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments