రైతును కడుపులో పెట్టుకున్న నేత కేసీఆర్ : ఎమ్మెల్యే గండ్ర

రైతును కడుపులో పెట్టుకున్న నేత కేసీఆర్ : ఎమ్మెల్యే గండ్ర


TGWNEWS/భూపాలపల్లి: ప్రకృతి కన్నెర్ర చేసిన రైతును కడుపులో పెట్టుకున్న నేత కేసీఆర్ అని భూపాలపల్లి  ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. ఇటీవలే కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహార చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలతో పంటనష్టం వాటిల్లిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని,రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని అన్నారు. రైతులను సంఘటితం చేసి వ్యవసాయ అవసరాలపై చర్చించుకు నేందుకు ప్రతి 5వేల ఎకరాలకు ఓక రైతు వేదికను ఏర్పాటు చేశారు.అనంతరం పత్తిపాక గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్థానిక మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments