మిషన్ భగీరథ అట్టర్ ప్లాప్ : బిజెపి నాయకుడు రాణా ప్రతాప్ రెడ్డి

మిషన్ భగీరథ అట్టర్ ప్లాప్ : బిజెపి నాయకుడు రాణా ప్రతాప్ రెడ్డి

 
TGWNEWS/నర్సంపేట : మిషన్ భగీరథ అట్టర్ ప్లాప్ అని బిజెపి నాయకుడు రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. ఇంటింటికి నల్లా నీరు అని వేలకోట్లు ఖర్చుపెట్టి మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, మిషన్ భగీరథ పథకం నర్సంపేట నియోజకవర్గంలో అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. పట్టణంలోని 15వ వార్డ్ తెలంగాణ కాలనీలో 48ఇళ్లకు గాను 5 ఇళ్లకు మాత్రమే మిషన్ భగీరథ నీరు వచ్చుచున్నదని, మిగతా వాళ్ళు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుచున్నారని అన్నారు.  నర్సంపేట పట్టణంలోనే ఈ పరిస్థితి ఉంటే మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు, నియోజకవర్గ ఎంఎల్ఏ, స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేసారు.

Post a Comment

0 Comments