కుట్లు వేయకుండా ఫెవిక్విక్ పెట్టిన వైద్య సిబ్బంది : గద్వాల్ జిల్లాలో దారుణం..

కుట్లు వేయకుండా ఫెవిక్విక్ పెట్టిన వైద్య సిబ్బంది...

 TGWNEWS /గద్వాల్ : జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలోని రెయిన్బో హాస్పిటల్ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. బాలుడు కిందపడి గాయాలు కావడంతో  తల్లిదండ్రులు  ప్రైవేటు ఆసుపత్రి తీసుకెళ్లారు. కాగా అక్కడున్న వైద్య సిబ్బంది  ఏకంగా కుట్లు వేయకుండా ఫెవిక్విక్ వైద్యం చేసిన ఘటన జోగులాంబ  గద్వాల జిల్లా ఐజ  లో జరిగింది. బాధిత తండ్రి వంశీకృష్ణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణా టక రాష్ట్రం రాయచూరు జిల్లా లింగసూగూరుకు చెందిన వంశీకృష్ణ, సునీత దంపతులు ఐజ  కు బంధువుల పెళ్లి నిమిత్తం వచ్చారు. వీరి కుమారుడు ఏడేళ్ల ప్రవీణ్ చౌదరి గురువారం రాత్రి పెళ్లి వేడుకల్లో ఆడుకుంటూ కిందపడ్డాడు. అతని ఎడమ కంటి పైభాగంలో గాయమ వడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయమైన చోట వైద్య సిబ్బంది కుట్లు వేయకుండా ఫెవిక్విక్తో అతికించారు. గుర్తించిన వంశీకృష్ణ ఆసుపత్రి వైద్యుడు నాగార్జునను నిలదీశారు. సిబ్బందితో పొరపాటు జరిగిందని, బాలుడికి ఏమీ కాదని, ఏమైనా జరిగితే బాధ్యత వహిస్తానని వైద్యుడు నచ్చజెప్పారు. ఇతనిపై బాధిత తండ్రి ఐజ  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం పట్టణంలో శుక్ర వారం చర్చనీయాంశంగా మారింది. ఎస్సై నరేశ్ కుమార్  మాట్లాడుతూ ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు...

Post a Comment

0 Comments