వడ్ల, మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్ది..

వడ్ల, మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్ది..

TGWNEWS /ఖానాపురం :  ఖానాపూర్, మండలాల్లో వడ్ల, మక్కల కొనుగోలు కేంద్రాలను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి  చేతుల మీదుగా ప్రారభించారు.  ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి నష్టపోయిన పంటలు 41,500 ఎకరాలమరో వారంలో ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం పంపిణీ పంటనష్టం నమోదు కానీ రైతులు వ్యవసాయ అధికారులకు తెలియజేయాలని,  ప్రతి రైతును ఆదుకుంటామని అన్నారు. అదేవిధంగా చెన్నరావుపేట పిఎసిఎస్ పరిధిలో వడ్ల & మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వడగండ్ల వర్షానికి నష్టపోయిన 41,500 ఎకరాలకు పంట నష్ట పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించనుందని, సీఎం కేసీఆర్  ప్రకటించినట్లు మరో వారంలో ఎకరాకు రూ.10 వేల చొప్పున పంట నష్టపరిహారాన్ని పంపిణీ చేయనునట్లు తెలిపారు.  రైతులు వానాకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రారంభించాలని కోరారు. ఈ  కార్యక్రమంలో ఎంపిపిలు, జెడ్పిటిసి, డి సి ఎస్ ఓ, వ్యవసాయ శాఖ ఏవో ఏఈ లు పిఎసిఎస్ చైర్మన్లు, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, క్లస్టర్ భాద్యులు, ఆర్ఎస్ఎస్ కన్వీనర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments