రేపు అల్ప పీడనం, విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం...
TGWNEWS/జాతీయం : శనివారం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనునట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంగా ఆదివారం అల్పపీడనంగా మారనుండగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. ఆపై వాయుగుండం, తుపానుగా మార్పు చెంది బంగ్లాదేశ్, మయన్మార్‌ల వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. అదేవిధంగా మే 11 తర్వాత నుంచి మళ్లీ వడగాడ్పులు ప్రారంభమవుతాయని తెలిపింది.


0 Comments