డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎక్కడా... ?రాణా ప్రతాప్ రెడ్డి ప్రశ్న..

డబుల్ బెడ్ రూం ఇండ్లు ఎక్కడా... ?రాణా ప్రతాప్ రెడ్డి ప్రశ్న..

TGWNEWS/నర్సంపేట : నర్సంపేట పట్టణం 17వ వార్డు శాంతినగర్ లో  ఉదయం నర్సంపేట నియోజకవర్గ బీజేపీ నాయకులు డాక్టర్  గోగుల రాణా ప్రతాప్ రెడ్డి  పర్యటించారు. అక్కడి కాలనీ వాసుల ఇండ్లు కూలి దిక్కు తోచని స్థితిలో ఉన్న వారిని చూసి చలించి పోయారు. ఈ సందర్బంగా అయన మాట్లడుతూ  తెలంగాణ  రాష్ట్రం ఏర్పాటు అయితే పేద, మధ్య తరగతి ప్రజలు అభివృద్ధి చెందుతారని కలలు కన్నారని, కానీ అధికార పార్టీ మాయ మాటలు విని పేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తాం, ఇంటి స్థలం ఉంటే 5లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పుడేమో 3లక్షలు ఇస్తామని మాయ మాటలు చెపుతూ వాళ్ళ ఓట్లతో గెలిచిన నర్సంపేట శాసన సభ్యులు ,అధికార పార్టీ నాయకులు  ఇకనైనా పేద కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments