బుడిగే సతీష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పోరిక బలరాం నాయక్

బుడిగే సతీష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పోరిక బలరాం నాయక్

TGWNEWS/మహబూబాబాద్ : మహబూబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన యువ నేత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుడిగే సతీష్ గౌడ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర మాజీ మంత్రివర్యులు పోరిక బలరాం నాయక్ అయన స్వగృహంలో కేక్  కట్ చేసి శాలువా తో సత్కరించారు.  ఈ సందర్భంగా   సతీష్  నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.  గూడూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్న సతీష్ ను పొగడ్తలతో కొనియాడారు.  ఈ కార్యక్రమంలో గూడూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ నునవత్ రమేష్ నాయక్,  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి స్వామి, బ్రాహ్మణపల్లి సర్పంచ్ పునెం యాకయ్య,. రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎండి యాకు పాషా, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments