కేటీఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి గంగుల, ఎమ్మెల్యే రసమయి..
TGWNEWS/కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం సిరిసిల్లలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


0 Comments