గుండె నిండా గులాబీ జెండా..నిలిచింది ప్రజల మనసు నిండా..


గుండె నిండా గులాబీ జెండా..నిలిచింది ప్రజల మనసు నిండా..

TGW NEWS/మానకొండూర్ : శంకరపట్నం మండల కేంద్రంలో ఈరోజు నిర్వహించిన బీ.ఆర్.ఎస్ పార్టీ యువ గర్జనతో రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ గారు ప్రభంజనం సృష్టించారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, మరియు బీ.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా ఛైర్మెన్ జీ.వి. రామకృష్ణా రావు గార్లు హాజరయ్యారు

శంకరపట్నం మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, బీ.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు, యువకులు బారీ సంఖ్యలో తరలి వచ్చి తాడికల్ గ్రామం నుండి భారీ బైక్ ర్యాలీతో కేశవపట్నంలోని లక్ష్మీప్రసన్న ఫంక్షన్ హల్ కు చేరుకున్నారు...ఎమ్మెల్యే రసమయి మూడోసారి మానకొండూర్ ఎమ్మెల్యే టిక్కెట్టు సాధించిన శుభ సందర్బంగా టిఆర్ఎస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ గర్జన భారీ బహిరంగ సభలో వినోద్ కుమార్ మరియు రసమయి గార్లు మాట్లాడారు..1969 లో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నాటి ప్రభుత్వము కాంగ్రెస్ 360 మందిని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్, ఖమ్మం తెలంగాణ వ్యాప్తంగా కాల్చి చంపిన ఘటనలు ఉన్నాయన్నారు

తెలంగాణ ఉద్యమం కోసం 2001లో ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటం మొదలుపెట్టి, 2009 లో తెలంగాణ సాధించుకునుడు సచ్చుడో అని అమర నిరాహార దీక్ష చేపట్టి కెసిఆర్ పోరాట ఫలితంగా 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నట్లు గుర్తు చేశారు...ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలనే కాకుండ, దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలని, లక్ష్యంతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిధులు విడుదల చేయడం జరిగిందని వివరించారు

రైతులకు రైతుబంధు రైతు బీమా, దళిత బంధు, పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి షాది ముబారక్, బీసీ రుణాలు,  గొల్ల కురుమలకు ఉచితంగా గొర్రెలు, అందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేటు పాఠశాలలకు దీటుగా నాడు ఉన్న 200 గురుకులాలను నేడు వెయ్యి గురుకులాలుగా తీర్చిదిద్ది గురుకుల పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ విద్యను అందిస్తున్నట్లు వెల్లడించారు..కరీంనగర్ జిల్లా మరియు మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం విజయోత్సవాలకు అడ్డా అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని 2014లో ఎమ్మెల్యేగా నాటినుండి నేటి వరకు ఎంతో అభివృద్ధి పరిచామన్నారు

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేదని, నేటి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బిజెపి ప్రభుత్వంలో నియోజకవర్గానికి ఎలాంటి నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మానకొండూర్ నియోజకవర్గానికి నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు..

Post a Comment

0 Comments