నవ దీప్ సెప్టెంబర్ 26న పోలీసులకు సరెండర్...

 నవ దీప్ సెప్టెంబర్ 26న పోలీసులకు సరెండర్...


TGW NEWS/హైదరాబాద్: పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు త్వరలో నోటీసులు..డ్రగ్స్ కథాచిత్రంలో అనేకానేక కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. మరోమారు టాలీవుడ్‌ను షేక్ చేసేలా మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరో ఇద్దరికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

కలహర్ రెడ్డితో పాటు స్నార్ట్ పబ్ యజమానికి ముందస్తు బెయిల్ ఇస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వీరిద్దరిని సెప్టెంబర్ 26న పోలీసులకు సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది.

మరోవైపు ఈ కేసులో కొందరు సినీ, రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇవ్వాలని నార్కోటిక్ బ్యూరో భావిస్తోంది. ప్రధానంగా హీరో నవదీప్, అతని స్నేహితుడు రాంచంద్‌లతో కాంటాక్ట్ అయినవారికి నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నారు.

అంతకుముందు మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న నవదీప్‌కు నార్కొటిక్ బ్యూరో అధికారులు 41ఎ కింద నోటీసులు జారీ చేశారు. నవదీప్ ఇంటి వద్ద ఈ నోటీసులు అందజేశారు.

ఈ నెల 23వ తేదీన హెచ్-న్యూ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నవదీప్, అతని స్నేహితుడు రాంచంద్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా నార్కొటిక్ బ్యూరో ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే నవదీప్ మాత్రం ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడు. ఇదే కేసులో మరికొంత మంది ఉన్నట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. పబ్ యజమాని సూర్య, కలహార్ రెడ్డి, శ్వేత, సినీ ఫైనాన్షియర్ రవి, కార్తీక్, శ్వేతలను డ్రగ్స్ వాడకందారులుగా చేర్చారు.

వీళ్లంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్లోనూ నార్కోటిక్ పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు.

Post a Comment

0 Comments