బీఆరెఎస్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి రాజీనామా .

బీఆరెఎస్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి రాజీనామా .


TGWNEWS/:మల్కాజ్గిరి బీఆరెస్‌ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఆరెస్‌ అధిష్టానాన్ని రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తనకు మల్కాజిగిరి టికెట్‌ను, తన కొడుకు రోహిత్‌కు మెదక్‌ టికెట్‌ను మైనంపల్లి కోరారు. అయితే సీఎం కేసీఆర్‌ మాత్రం హనుమంతరావుకు మాత్రం మల్కాజిగిరి టికెట్‌ ఇచ్చి , రోహిత్‌కు టికెట్‌ నిరాకరించింది. దీంతో రెచ్చిపోయిన మైనంపల్లి మంత్రి టి.హరీశ్‌రావుపైన, పరోక్షంగా సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌లపైన కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆరెస్‌కు రాజీనామా చేసిన మైనంపల్లితో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు టచ్‌లో ఉండటంతో ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశముందని భావిస్తున్నారు.

Post a Comment

0 Comments