బిజెపి ఉపాధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ
TGW NEWS/పాపానపేట: ఏడుపాయల దేవస్థానానికి 100 కోట్లు మంజూరు ఒక పెద్ద డ్రామా అని , అమ్మవారి బంగారం ఈఓ ఇంట్లో దాచుకున్నాడన్న ఆరోపణలను డైవర్ట్ చేయడానికే మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిందని పేర్కొన్నారు. గురువారం నాడు ఆయన మాట్లాడుతూ ఏడుపాయల ఈవో దోపిడీ వెనుక ఎమ్మెల్యే భర్త దేవేందర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. అందుకోసమే ఈఓ ను సస్పెండ్ చేయించకుండా ఎండోమెంట్ అధికారులపై ఒత్తిడి తెచ్చి చాకరిమెట్లకు బదిలీ చేయించారని, కేవలం ఏడుపాయల ఆదాయాన్ని దోచుకోవడానికే ఎమ్మెల్యే మరియు ఆమె భర్త ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి ఈవో సార శ్రీనివాస్ ను కాపాడుతున్నారని మీడియాకు వెల్లడించారు. బలమైన ఆధారాలున్నా సస్పెండ్ చేయకుండా బదిలీ చేయించడం ఎమ్మెల్యే, ఆమె భర్త దేవేందర్ రెడ్డి పతనానికి నాంది అన్నారు. సొంతపార్టీ నేతలే ఎమ్మెల్యే భర్త దేవేందర్ రెడ్డి అవినీతి చేశాడని పసుపు బట్టలతో మంజీరా నదిలో మునిగి దుర్గామాతపై ప్రమాణం చేయడం దేవేందర్ రెడ్డి సిగ్గుపడాలని విమర్శించారు. దేవేందర్ రెడ్డి దుర్గామాత పై ప్రమాణం చేసి దేవస్థాన ప్రతిష్టకు భంగం కలిగించాడని , భక్తుల మనోభావాలను దెబ్బతీశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలతో 100 కోట్లు అని వందల సార్లు డబ్బా కొట్టుకునే ఎమ్మెల్యే ఆ 100 కోట్లు గత ఏడాదే ప్రకటించారని ఇప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికే 100 కోట్ల రూపాయల అంశం మళ్లీ తెరమీదకు తెస్తున్నారని, ప్రజల్ని, వన దుర్గామాత భక్తుల్ని తప్పుదారి పట్టించి ఈవో ను కాపాడారని దుయ్యబట్టారు...

0 Comments