అంబేద్కర్ విగ్రహం ఎదుట మధ్యాహ్న భోజన నిర్వహకుల నిరసన...
TGW NEWS/ శంకరపట్నం :మండల కేంద్రమైన శంకరపట్నం అంబేద్కర్ విగ్రహం ఎదుట, మధ్యాహ్న భోజన వంటకాల నిర్వాహకులు బుధవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు నిరసన వ్యక్తం చేశారు, పాఠశాలలో గత కొన్ని నెలల నుండి వంటకాలు చేస్తే ఇంతవరకు కూడా డబ్బులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు, ప్రభుత్వం న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని మహిళలు స్థానిక ఎమ్మెల్యే రసమయ బాలకిషన్కు వినతి పత్రం అందజేశారు సకాలంలో స్పందించి న్యాయం చేయాలని కోరారు, పాఠశాలలో ప్రభుత్వానిబంధన మేరకే కష్టపడి వంటలు చేసి విద్యార్థులకు వడ్డించడం జరుగుతుందన్నారు నెలలు గడుస్తున్న వచ్చే డబ్బులు కూడా రాకపోవడం బాధాకరం అన్నారు, అప్పుల అప్పుల పాలైనట్లు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు దయామయిలైన తమరు న్యాయం చేసి ఆదుకోవాలని మహిళలు ఎమ్మెల్యేను వేడుకున్నారు, ఎమ్మెల్యే స్పందించారు ప్రభుత్వము నుంచి వచ్చే బకాయిలు సకాలంలో వచ్చే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు మహిళలకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు మహిపాల్ మహిళలు పాల్గొన్నారు వంటకాల నిర్వాహకులు

0 Comments