మెదక్ నుండి పోస్టల్ ఆఫీస్ తరలింపుపై కాంగ్రెస్ ఆందోళనలు

మెదక్ నుండి పోస్టల్ ఆఫీస్ తరలింపుపై కాంగ్రెస్ ఆందోళనలు

TGW NEWS/మెదక్: రాస్తారోకోకు దిగిన పీసీసీ నేతలు సుప్రబాతరావు, మ్యాడం బాలక్రిష్ణ సిద్దిపేటకు కార్యాలయం తరలిస్తున్నారంటూ ఆరోపణలు మంత్రి హరీష్, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మ తీరుపై తీవ్ర అభ్యంతరం కార్యాలయం తరలించవద్దని డివిజనల్ మేనేజర్ కు వినతి పత్రం

మెదక్ నుండి మరో కార్యాలయం తరలింపునకు రంగం సిద్దమైంది. సుమారు 18 ప్రధాన కార్యాలయాలకు సిద్దిపేటకు ఇప్పటికే తరలిపోగా, తాజాగా పోస్టల్ డివినల్ కార్యాలయం కూడా మెదక్ నుండి తరలిస్తున్నారనే వార్తలు జిల్లాలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ అంశంపై శుక్రవారంనాడు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు దిగింది. పీసీసీ నేతలు సుప్రబాతరావు, మ్యాడం బాలక్రిష్ణ మెదక్ లోని హెడ్ పోస్టాఫిసు ముందు భారీ అందోళనలకు దిగారు. వందలాదిగా వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు మెదక్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఎక్కడికక్కడా వాహనాలను రాకపోకలను అడ్డుకున్నారు. ఈ అందోళనలతో భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ భారీ నిరసన చేపట్టారు. మంత్రి హరీష్, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. పోస్టల్ డివినజల్ మేనేజర్ కు వినతి పత్రం సమర్పించారు. ఇక్కడి నుండి కార్యాలయం తరలించవద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కార్యకర్తలను పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం కాంగ్రెస్ నేతలను సొంత పూచికత్తు విడుదల చేశారు. 

ఇందిరమ్మ ఇస్తే.. హరీష్ ఎత్తుకెళ్తున్నాడు పీసీసీ నేతల ఆరోపణలు

దివంగత ప్రధాని ఇందిరాగాంధీ మెదక్ లో పోస్టల్ డివిజనల్ కార్యాలయాన్ని మంజూరు చేసి అద్భుతమైన భవనం కట్టించారని, ఆ కార్యాలయాన్ని సిద్దిపేటకు తరలించాలని మంత్రి హరీష్ రావు కుట్ర పూరిత వైఖరికి తెరలేపారని పీసీసీ నేతలు చౌదరి సుప్రబాతరావు, మ్యాడం బాలక్రిష్ణ ఆరోపించారు. ఈ మేరకు వారు విలేఖర్లతో మాట్లాడుతూ మెదక్ నుండి అనేక కార్యాలయాలను ఇప్పటికే తరలించారని, ఇందిరమ్మ ఇచ్చిన పోస్టాఫిసుపై కన్నేసి దానిని కూడా తరలిస్తున్నారని మండిపడ్డారు. పోస్టల్ డివిజనల్ కార్యాలయ తరలింపుపై మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి ద్వారా తీవ్ర ఒత్తిడి, కుట్ర జరుగుతుందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే అసమర్థ వైఖరి వలన మెదక్ నుండి కార్యాలయాలు ఒక్కొక్కటిగా తరలిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో భవిష్యత్ లో మరిన్ని ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా SC సెల్ అధ్యక్షులు జంగర్ల గోవర్ధన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, హఫీజ్ మొల్సబ్, వైస్ ఎంపీపీ సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ లు శివకుమార్, ప్రసాద్ గౌడ్ రాయిన్ పల్లి ఎంపీటీసీ శ్రీహరి, సీనియర్ నాయకులు పంతులు బుమన్న, రామాయంపేట మాజీ పట్టణ అధ్యక్షులు డాకి స్వామి, అసెంబ్లీ యువజన ఉపాధ్యక్షలు భారత్ గౌడ్, అనుదీప్ (విక్కీ), అసెంబ్లీ యువజన జనరల్ సెక్రటరీ సంతాప్ప, పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ చౌదరి, చిన్న శంకరంపేట్ మండల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మాడూర్ నవీన్, సంజీవ్, అల్లాడి వెంకటేష్, కడియాల మల్లేష్, కోర్విపల్లి రాంచంధర్, బోగాడా భూపతిపూర్ సంజీవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీశేలం, మహిపాల్, నాగేందర్, గౌతమ్, సంపత్, చింటూ, లడ్డు, కిషన్, కోటి రాజు, మధుసుధన్, వెంకటేష్, బిక్షపతి, మహేష్, ప్రభాకర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments