దేశ నిఘంటువు అంబేద్కర్...

 దేశ నిఘంటువు అంబేద్కర్...

TGW NEWS/శంకరపట్నం:రాజ్యాంగం తోనే పార్లమెంటు వ్యవస్థ సంస్కృత విభాగం చైర్మన్ రసమయ బాలకృష్ణ శంకరపట్నం మండలంలోని కరీంపేట గ్రామంలో బుధవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మానకొండూరు ఎమ్మెల్యే సంస్కృత విభాగం చైర్మన్ రసమయ బాలకిషన్ ఆవిష్కరించారు,, ఈ సందర్భంగా మహిళలు డప్పు సప్పులతో గ్రామంలో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించి నుదుటిపై తిలకం దుద్ది మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు, అంబేద్కర్ యువజన సంఘం సీనియర్ నాయకుడు కార్యనిర్హణ కమిటీ సమన్వయకర్త మెరుగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో యువకులు రసమయను ఎత్తుకొని ఊరేగింపుగా సభ ప్రాంగణం వద్దకు తీసుకువచ్చారు, మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికి గుమ్మడికాయ దింపి దిష్టి తీసివేశారు, అనంతరం జరిగిన సమావేశంలో రసమయి బాలకిషన్ మాట్లాడారు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ఆలోచన విధానాలను యువత పాటించాలన్నారు రాజ్యాంగం తోనే భారత పార్లమెంటు వ్యవస్థ కొనసాగుతుందని గుర్తు చేశారు ప్రధాని రాష్ట్రపతి ఎంపీలు ఎమ్మెల్యేల రిజర్వేషన్ల సౌకర్యం కల్పించిన మేధావిగా అంబేద్కర్ను కొనియాడారు, అట్టడుగు వర్గాల పేదవారికి ఓటు హక్కు కల్పించిన మేధావిగా అంబేద్కర్ ను కొనియాడారు, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని యువతి యువకులు పాటించి విద్యారంగంలో ఎదగాలన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు అట్టడుగు వర్గాలకు రైతంగానికి బడుగు బలహీన వర్గాలకు విద్యారంగానికి కోట్లాది రూపాయల నిధులను విడుదల చేసి సంక్షేమ పథకాలను అమలు చేయుటకు కీలకపోత్ర పోషించడం జరుగుతుందన్నారు, యువత మేధస్సుతో ఎదిగి అన్ని రంగాలలో ముందుండాలన్నారు, ఎమ్మెల్యే సుమారు గంట పైగా ప్రసంగించి యువతను మహిళలను రైతులను కార్యకర్తలను ఆకట్టుకున్నారు, దళిత వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు పేదరికం ఆర్థిక వ్యవహారాలు మారుతున్న పరిస్థితులు అనేక అంశాలపై వివరించారు, గ్రామ అభివృద్ధికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు, ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి అంబేద్కర్ ఉత్సవ కమిటీ సమన్వయకర్త మెరుగు శ్రీనివాస్,  జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి సర్పంచుల పొరమ్ అధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి వైస్ ఎంపీపీ రమేష్ హుజురాబాద్ వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ వీరస్వామి సర్పంచులు భద్రన్న రాజయ్య ఎంపీటీసీ గాండ్ల తిరుపతి, సర్పంచ్ మల్లయ్య సింగిల్ విండో చైర్మన్లు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనగా కళాబృందం పాడిన పాటలు సభికులను ఎంతో ఆకట్టుకున్నాయి

Post a Comment

0 Comments