నైపుణ్యం గల యువతను ప్రోత్సాహించాలి పిల్లుట్ల శ్రీనివాస్

నైపుణ్యం గల యువతను ప్రోత్సాహించాలి పిల్లుట్ల శ్రీనివాస్       

TGW NEWS/కోదాడ:స్థానిక యువకులు నూతనంగా నిర్మిస్తున్న రైతు అంశంపై సినిమాకి ఈరోజు కోదాడ లోని అయ్యప్ప స్వామి దేవాలయం లో

కోదాడ నియోజకవర్గ ఇంచార్జ్ పిల్లుట్ల శ్రీనివాస్ క్లాప్స్ కొట్టి ప్రారంచారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిత్ర నిర్మాత రొడ్డపల్లి శ్రీనివాస్, దర్శకుడు తిరుపతి గారిని రైతుల అంశంతో తీసే సినిమా ఒక సాహసమని ప్రశంసించారు. ఈ సినిమా  ప్రతిఒక్కరిలో స్ఫూర్తినిస్తుందని ఇలాంటి వారిని సమాజంలోని ప్రతిఒక్కరు

ప్రోత్సహించాలని అదేవిధంగా అన్నిరంగాలలో కూడా యువకులు చాలా నైపుణ్యం ఉంటుందని వారిని ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. బిఎస్పి పార్టీ అధికారంలోకి రాగానే ఆర్.యస్ ప్రవీణ్ కుమార్ గారి సారథ్యంలో బహుజన ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసి 24 ఫ్రేమ్ ల్లో  శిక్షణ ఇచ్చి అన్ని వర్గాల యువతకు వారి అభిష్టాన్ని బట్టి నైపుణ్యం గల కళలను ప్రోత్సాహిస్తామన్నారు. కాబట్టి ఈ సినిమాని ప్రతిఒక్కరు చూసి ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి జిల్లాకార్యదర్శి సాలె రామారావు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి యరసాని కృష్ణ యాదవ్, కోదాడ మండల అధ్యక్షుడు మేరే యల్లారావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments