- కార్పొరేట్ విద్యకు బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం కసరత్తు..

 కార్పొరేట్ విద్యకు బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం కసరత్తు...

TGW NEWS/మానకొండూర్: ఎమ్మెల్యే డా.శ్రీ.రసమయి గారు 

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిధులు విడుదల చేస్తున్నారని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ అన్నారు

శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో ఈరోజు ఆయన అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన, నూతన గ్రామపంచాయతీ, భవనం మహిళా సమైక్య భవనం, ఆయుర్వేద వైద్యశాల భవనం, రజక కమ్యూనిటీ మరియు ఓపెన్ జిమ్ భవనం కోసం శంకుస్థాపన చేశారు

అనంతరం చింతల పల్లె గ్రామంలో గ్రామ దేవత పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, బీ.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే రసమయి గారికి ఘనస్వాగతం పలికారు


అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే రసమయి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి కులవృత్తులను కుల సంఘాలను అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, రానున్న రోజుల్లో ప్రతి పేద కుటుంబాలకు, కార్పొరేట్ విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు

ప్రతి పేద విద్యార్థి ఇతర దేశాల్లో ఉన్నత చదువులు చదవడానికి తెలంగాణ కేసీఆర్ రూ.20 లక్షలకు పైన ప్రభుత్వం నుండి స్కాలర్షిప్లను అందజేయడం జరుగుతుందని, ప్రతి పేద విద్యార్థి చదివే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు...

Post a Comment

0 Comments