ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని తాసిల్దార్ కి వినతి....
TGW NEWS/చిలుకూరు: ప్రతినిధి Nookapangu Manikanta చిలుకూరు మండలంలోని బేతావోలు గ్రామానికి చెందిన, పలు కుటుంబాలు తాము నివాసం ఉంటున్న స్థలాలకు పట్టాలు ఇవ్వాలని
సోమవారం తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు, గ్రామంలోని దేవుని మాన్యం 1432 సర్వే నెంబర్ లో గత 30 సంవత్సరాల నుండి ఇల్లు లేని నిరుపేదలు, ఇల్లు నిర్మించుకొని నివాసముంటున్నారు, గృహ
లక్ష్మీ పథకం ద్వారా ఇంటి నిర్మాణం కొరకు, ఇల్లు మంజూరు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు, జీవో నెంబర్ 58, 59, క్రమబద్ధీకరణ చేసి పట్టాలి ఇవ్వాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో, టిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు,
వట్టికూటి నాగయ్య, ఎర్రమల్ల వెంకటేశ్వర్లు, రెమిడాల లింగయ్య, బత్తిని పాపారావు, ఎస్ కే కాసిం,పోలంపల్లి చంద్రమ్మ,గణపారపు కనకమ్మ, బత్తిని వీరమ్మ, తాళ్ల నాగమణి,పోలంపల్లి లింగమ్మ, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు,,,,


0 Comments