డబల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు ఇవ్వాలని


డబల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు ఇవ్వాలని...

TGW NEWS/చిలుకూరు: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని నారాయణపురం గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిరుపయోగంగా ఉన్నాయని వసతులు కల్పించి ప్రజలకు అందజేయాలని లబ్ధిదారులు కోరారు. ఈ

సందర్భంగా వారు మాట్లాడుతూ... ఇల్లు నిర్మించారు కానీ వసతులు కల్పించకుండా నిరుపయోగంగా ఉండటం వల్ల ఏమి ఉపయోగo అని,మంచినీరు, విద్యుత్, సౌకర్యాలు కల్పించి అర్హులైన నిరుపేదలకు

అందించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి వసతులు కల్పించాలని, నారాయణపురం గ్రామంలో ఉన్న ప్రజలు ఒక్క ఇంట్లో నాలుగు కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని,

ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అధికారులు స్పందించి నిరుపేద కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు....

Post a Comment

0 Comments