బిఆర్ఎస్ దాడిలో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్త జావిద్ ఖాన్‌ను పరామర్శించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

బిఆర్ఎస్ దాడిలో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్త జావిద్ ఖాన్‌ను పరామర్శించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల జిల్లా, మందమర్రి: క్యాతనపల్లి లో ఇటీవల బిఆర్ఎస్ నాయకులు జరిపిన దాడిలో గాయపడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జావిద్ ఖాన్‌ను రాష్ట్ర కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి గారు మందమర్రి లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, ధైర్యం చెప్పారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి గారు పలు ముఖ్యాంశాలను వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం ATC సెంటర్లలో హార్టీకల్చరల్, అగ్రికల్చరల్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ATC సెంటర్లలో చదివే ప్రతి విద్యార్థికి రూ.2,000 స్కాలర్షిప్ అందిస్తామని చెప్పారు.

చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేదలకు మంజూరు చేశామని, రాబోయే ఏప్రిల్ నెలలో మరో 2,000 ఇండ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.

ఇంటింటికి తాగునీరు అందించేందుకు అమృత్ పథకం కింద రూ.100 కోట్లతో పనులు జరుగుతున్నాయని, ఆరు నెలల్లో పూర్తిచేసి ప్రతి ఇంటికి తాగునీరు అందేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు నీరు అందించాలని సూచించినట్లు చెప్పారు.

గత బిఆర్ఎస్ హయంలో డ్రైనేజీ కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపించిన మంత్రి గారు, వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యమంత్రి Revanth Reddy నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు.

Post a Comment

0 Comments