బంధాల విలువ మరిచిన సమాజం.. ప్రేమ పేరుతో రక్త సంబంధాలకు మచ్చ!
కర్ణాటక ఘటన సమాజానికి హెచ్చరికగా మారాలా..?కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం సమాజంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. కుటుంబ బంధాలు, సంప్రదాయాలు, నైతిక విలువలను పక్కనబెట్టి అక్కాతమ్ముళ్లుగా పెరిగిన ఇద్దరు యువతీ యువకులు వివాహం చేసుకోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. శశికళ, ప్రవీణ్ అనే యువతీ యువకులు గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరి తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు కావడంతో కుటుంబ పరంగా వీరు అత్యంత దగ్గరి బంధువులు. అయితే ఈ రక్త సంబంధాన్ని మరిచిపోయి ప్రేమ పేరుతో వివాహం చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.ఇటీవల శశికళకు మరో వ్యక్తితో వివాహం నిశ్చయమవడంతో, ఆమె ప్రవీణ్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుంది. అనంతరం తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యులు, పెద్దలు ఎంత చెప్పినా.. “భర్తతోనే జీవిస్తాను” అని శశికళ స్పష్టం చేసినట్లు సమాచారం.ఈ ఘటనపై సామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. “ప్రేమ” అనే భావన పేరు చెప్పుకొని కుటుంబ బంధాలను, సంస్కృతిని, నైతిక విలువలను పక్కనబెడితే సమాజం ఎటు దిశగా వెళ్తుందో ఆలోచించాల్సిన అవసరం ఉందని పెద్దలు అభిప్రాయపడు ప్రేమ అనేది పవిత్రమైన భావన. కానీ అది కుటుంబ బంధాలను, రక్త సంబంధాలను దాటిపోతే సమాజంలో గందరగోళానికి దారి తీసే ప్రమాదం ఉంది. భారతీయ సంస్కృతి కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. అలాంటి విలువలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత.తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచే కుటుంబ బంధాల గొప్పతనం, నైతిక విలువలు, సమాజ పరిమితుల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం మరింత పెరుగుతోంది. సాంకేతిక యుగంలో భావోద్వేగాలకు లోనవకుండా, బాధ్యతతో నిర్ణయాలు తీసుకోవడం యువతకు అత్యంత ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

No comments:
Post a Comment