🔴
Loading latest posts...
Showing posts with label Nereducherla. Show all posts
Showing posts with label Nereducherla. Show all posts

Saturday, May 16, 2026

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...



నేరేడుచర్లలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సైదిరెడ్డి గారిని బూర్గులతండా కాంగ్రెస్ గ్రామ శాఖ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు మలోతు అఖిల్, సర్పంచ్ మలోతు నాగు, మలోతు వినోద్, నాగు, ఈశ్వర్, మహేష్, సైదా తదితరులు పాల్గొన్నారు.

పెట్రోలియం ధరల పెంపుపై సీపీఐ వినూత్న నిరసన..

పెట్రోలియం ధరల పెంపుపై సీపీఐ వినూత్న నిరసన..



పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపును నిరసిస్తూ నేరేడుచర్లలో సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ముందు కళ్లకు గంతలు కట్టుకొని మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ధూళిపాళ ధనుంజయ నాయుడు మాట్లాడుతూ పెట్రోల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు.

Thursday, May 14, 2026

దిర్శించర్లలో బడిబాట కార్యక్రమం నిర్వహణ...

దిర్శించర్లలో బడిబాట కార్యక్రమం నిర్వహణ...

దిర్శించర్ల గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బుర్రి శ్రీను, మండల పరిషత్ పాఠశాల హెచ్‌ఎం, హైస్కూల్ హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, మార్కెట్ డైరెక్టర్, గ్రామ పెద్దలు కలిసి నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో ఉన్న కూలీలను కలిసి వారి పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య, ఉచిత సౌకర్యాలపై అవగాహన కల్పించారు. ప్రతి బడి ఈడు పిల్లవాడు చదువుకు దూరం కాకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు

Tuesday, May 12, 2026

మైనర్ బాలిక ఘటనపై నేరేడుచర్లలో నిరసన...

మైనర్ బాలిక ఘటనపై నేరేడుచర్లలో నిరసన...

నేరేడుచర్ల చౌరస్తాలో బీఆర్‌ఎస్‌వై విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి బండి సాయి భగీరథను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. ఈ సందర్భంగా బండి సంజయ్, భగీరథకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చిత్రపటాలను దహనం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.

Monday, May 11, 2026

నేరేడుచర్ల నూతన ఎస్ఐ గా ఏ. సైదిరెడ్డి...

నేరేడుచర్ల నూతన ఎస్ఐ గా ఏ. సైదిరెడ్డి...

నేరేడుచర్ల నూతన ఎస్ఐ గా ఏ. సైదిరెడ్డి సోమవారం పదవి బాధ్యతలు తీసుకున్నారు. కాగా మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి Conversation బదిలీ పై వచ్చారు. ఈ సందర్భంగా పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు... నేరేడుచర్లలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సైదిరెడ్డి గారిని బూర్గులతండా కాంగ్రెస్ గ్రామ...