🔴
Loading latest posts...
Showing posts with label Bharat. Show all posts
Showing posts with label Bharat. Show all posts
Thursday, May 14, 2026
ఇక నుండి ప్రతీ ఆదివారం పెట్రోల్ బంకులు బంద్?
ఇక నుండి ప్రతీ ఆదివారం పెట్రోల్ బంకులు బంద్?
ఇంధన పొదుపు కోసం మే 14 నుంచి ఎనిమిది రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేస్తారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాని మోడీ తన కాన్వాయ్లో వాహనాలను తగ్గించుకుని ఆదర్శంగా నిలిచారని, ప్రజలు కూడా సహకరించాలని ఇలా చేస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం, చమురు సంస్థల నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Tuesday, May 5, 2026
తమిళనాడులో టివికే విజయ్ కు మద్దతుగా నిలవాలని కాంగ్రెస్ నిర్ణయం
తమిళనాడులో టివికే విజయ్ కు మద్దతుగా నిలవాలని కాంగ్రెస్ నిర్ణయం..
ఏఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్యుల సమావేశం
హాజరైన రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్
ఐదు రాష్ర్టాల ఎన్నికలు, ఫలితాలు, అనంతర పరిస్థితులపై సమావేశంలో చర్చ
తమిళనాడు లో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని టివికె అధినేత విజయ్ కోరారు
లౌకిక ప్రభుత్వ ఏర్పాటు, రాజ్యాంగ పరిరక్షణ కోసం తమిళనాడు ప్రజలు తీర్పు నిచ్చారు
విజయ్ పార్టీ విజ్నప్తిపై తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశాం
సమావేశానంతరం కేసీ వేణుగోపాల్
తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు..
తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు..
DMK ఆఫీస్‌లో ఎమ్మెల్యేలతో స్టాలిన్ సమావేశం..
హాజరుకాని కాంగ్రెస్ పార్టీ నేతలు..
ప్రత్యేకంగా కాంగ్రెస్ నేతల నేతల భేటీ
అధికారం దక్కిన విజయ్… కుటుంబం చేరువవుతుందా?
అధికారం దక్కిన విజయ్… కుటుంబం చేరువవుతుందా?
చెన్నై: మే 05
తమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేస్తూ సినీ నటుడు విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రికళగం పార్టీ ప్రారంభ ధోరణుల నుంచే ఆధిపత్యం చాటుకుంటూ 100 సీట్ల మార్కును దాటి, మ్యాజిక్ సంఖ్య 118ను ఈజీగా అధిగమించి ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఒకప్పుడు సినిమా థియేటర్ల వద్ద క్యూ కట్టిన జనం ఇప్పుడు ఓట్ల వర్షం కురిపించి విజయ్‌ను నేరుగా అసెంబ్లీకి పంపించారు. ఎన్నికల్లో సుమారు 85 శాతం ఓటింగ్ నమోదవ్వడం, ముఖ్యంగా మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా తరలి రావడం రాష్ట్రంలో మార్పు కోసం ఉన్న ఉత్సాహాన్ని స్పష్టంగా చూపించింది. మహిళా సంక్షేమ హామీలు విజయ్ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఇదిలా ఉండగా, విజయ్ వ్యక్తిగత జీవితం కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆయన భార్య సంగీత గత కొంతకాలంగా ఆయనకు దూరంగా ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్ ముఖ్యమంత్రి అవుతున్న నేపథ్యంలో ఆమె మళ్లీ ఆయన దగ్గరకు వస్తుందేమో అన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో గట్టిగా వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.మరోవైపు నటి త్రిషతో విజయ్ సాన్నిహిత్యం గురించి గతంలో వచ్చిన వదంతులు కూడా మళ్లీ చర్చకు దారి తీస్తున్నాయి. ఈ అంశాలన్నీ ఇప్పటికీ అధికారికంగా నిర్ధారించబడని ప్రచారంగానే ఉన్నప్పటికీ, ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక విజయ్ కుటుంబానికి సంబంధించి మరో అంశం కూడా సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. కొడుకు తండ్రికి దూరమైన తర్వాత తన పేరులో నుంచి తండ్రి పేరు తీసివేశాడనే విమర్శలు అప్పట్లో వినిపించాయి. ఇప్పుడు విజయ్‌కు వచ్చిన రాజకీయ హోదా, ప్రజాదరణ నేపథ్యంలో “తండ్రి దగ్గరకు మళ్లీ చేరుతాడా?” అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తండ్రి–కొడుకు సంబంధం మళ్లీ సవ్యంగా మారవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయంగా చూస్తే విజయ్ ప్రయాణం స్పష్టమైన ప్రణాళికతో సాగింది. 2009లో అభిమాన సంఘాలను “విజయ్ మక్కల్ ఇయక్కం”గా మార్చి ప్రజాసేవలోకి అడుగుపెట్టిన ఆయన, 2024లో తమిళగ వెట్రికళగం పార్టీని స్థాపించారు. “సినిమా నా వృత్తి – రాజకీయాలు నా బాధ్యత” అనే నినాదంతో యువతలో విపరీతమైన స్పందన తెచ్చుకున్నారు.
సామాజిక న్యాయం, లౌకికవాదం అనే సిద్ధాంతాలతో ముందుకు సాగుతూ, నీట్ పరీక్ష రద్దు, విద్యను రాష్ట్ర జాబితాలోకి తీసుకురావడం, మహిళా సంక్షేమం, యువత ఉపాధి వంటి కీలక అంశాలపై గళమెత్తారు. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, ఆర్థిక సాయం, పేదల పెళ్లిళ్లకు బంగారం వంటి హామీలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి.
ఈ ఎన్నికల్లో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఓటమి పాలవ్వడం, అలాగే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన నియోజకవర్గంలో కఠిన పోటీని ఎదుర్కోవడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు.
మొత్తానికి, సినిమా నటుడిగా ప్రారంభమైన ప్రయాణాన్ని రాజకీయ నాయకుడిగా కొత్త దిశలో నడిపిస్తున్న విజయ్ ముందున్న సవాళ్లు మాత్రం చిన్నవి కావు. నీటి ఎద్దడి, నిరుద్యోగం, అవినీతి వంటి సమస్యలపై ఆయన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది కీలకం. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేది రాబోయే కాలమే నిర్ణయించాలి.
మే 16న విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణం..?
మే 16న విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణం..?
తమిళనాడు, మే 5 : తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా 10 స్థానాలు దూరంలో ఉంది. అధికారాన్ని దక్కించుకునేందుకు టీవీకే మద్దతు సమీకరణపై దృష్టి సారించింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీతో విజయ్ జరిపిన చర్చలు కీలకంగా మారాయి. కాంగ్రెస్ పార్టీకి లభించిన 5 సీట్లు ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి సానుకూల సంకేతాలు రావడం టీవీకేకు ఊతమిచ్చే అంశంగా మారింది. ఇక పీఎంకే, వీసీకే, సీపీఎం వంటి చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు కూడా టీవీకే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ పార్టీల మద్దతు లభిస్తే విజయ్‌కు అవసరమైన మెజారిటీ సాధించడం సులభమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియలో భాగంగా గవర్నర్‌ను కలవడం, మద్దతు లేఖలు సమర్పించడం వంటి చర్యలు త్వరలోనే జరిగే అవకాశం ఉంది. అన్ని రాజకీయ సమీకరణలు అనుకూలిస్తే మే 16వ తేదీన విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ అంశంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మద్దతు స్పష్టత వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Subscribe to:
Posts (Atom)
ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...
ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు... నేరేడుచర్లలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సైదిరెడ్డి గారిని బూర్గులతండా కాంగ్రెస్ గ్రామ...
-
బంధాల విలువ మరిచిన సమాజం.. ప్రేమ పేరుతో రక్త సంబంధాలకు మచ్చ! కర్ణాటక ఘటన సమాజానికి హెచ్చరికగా మారాలా..?కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ల...
-
ప్రభాస్ ఫౌజీ మూవీ నిర్మాణ బృందంలో విషాదం..! ఈరోజు షూటింగ్ కోసం వెళ్తుండగా ప్రమాదం..! అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ప్రమాదం...! అదుపుతప్పిన వాహనం...
-
డయల్ 112 కాల్‌తో నలుగురి ప్రాణాలు రక్షణ.. భర్త వేధింపులతో పిల్లలతో కలిసి ఆత్మహత్యకు వెళ్లిన మహిళ..రైలు కిందపడి చనిపోవాలని ప్రయత్నించిన తల్లి...
-
ఏసీబీ వలలో భద్రాచలం అటవీశాఖ అధికారులు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ. 3.50 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎఫ్‌డీవో సుజాత, చర్ల ఇన్ఛార...
-
బెంగాల్: మమతాబెనర్జీ సంచలన వ్యాఖ్యలు... సీఎం పదవికి నేను రాజీనామా చేయను. లోక్‌భవన్‌కు వెళ్లను... గవర్నర్‌కు రాజీనామా లేఖ ఇవ్వను... మేం ఎన్...
-
వర్షాలు ఎక్కెడెక్కడ పడనున్నా యో తెలుసా .... ? శ్రీలంక మీదుగా ఉన్న ఆవర్తనం రానున్న 72 గంటల్లో అల్పపీడనంగా మారనున్న నేపథ్యంలో రాబోయే రెండు ...
-
రానున్న 48 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు... తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతున్నప్పటికీ మరోవైపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వె...
-
TVK.విజయ్ పార్టీ పరిస్థితి... తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో (హంగ్ అసెంబ్లీ) ప్రభుత్వం ఏర...
-
మక్తల్‌లో జింకల వేట ముఠా అరెస్ట్ జింకల వేటకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి, నిందితుల నుండి ఒక రైఫిల్, మూడు ఎయిర్ గన్స్‌ను...
-
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిరోదిద్దాం... నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయం నందు ASR సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్ ఆధ్వర...




