బాలికపై పాస్టర్ అత్యాచారం...
ఏలూరు గుడివాడ:ఎవరికైనా చెబితే దేవుడు శపిస్తాడని బెదిరింపు.కామవరపుకోట ఓ చర్చి పాస్టర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు నెలసరి తప్పడంతో గర్భనిరోధక మాత్రలు వేశాడు. తీవ్ర రక్తస్రావంతో బాలిక అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం బాధ్యతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు . బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కామవరపుకోట మండలం.కళ్ళచెరువుకు చెందిన పాస్టర్ చౌటపల్లి రాంబాబు చర్చి ఏర్పాటు చేసుకొని ప్రార్థనలను నిర్వహించేవాడు ఈ క్రమంలో కూలి పనులు చేసుకునే ఓ కుటుంబం ఆయన వద్దకు వచ్చి ప్రార్థనలు చేయించుకునేవారు. వారి కుమార్తె (14) పై కన్నేసిన పాస్టర్ తరచూ ఆమెపై అత్యాచారం చేస్తూ ఎవరికైనా చెబితే దేవుడు శపిస్తాడని బెదిరించేవాడు. దీంతో ఆ బాలిక ఎవరికి చెప్పలేదు. ఈ నేపథ్యంలో బాలిక నెలసరి రాకపోవడంతో గర్భనిరోధక మాత్రలు అధిక మోతాదులో పాస్టర్ వాడించాడు. బాలిక తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ తల్లికి జరిగిన విషయం చెప్పింది. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆధ్యాత్మిక ప్రార్థనల పేరుతో అభం శుభం తెలియని బాలికపై అత్యాచారానికి పాల్పడిన పాస్టర్ కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
తడికలపూడి ఎస్సై వల్లి పద్మ కేసు నమోదు చేశారు
