పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు ప్రమాణస్వీకారం
పశ్చిమ బెంగాల్ తొలి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరి గిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు, కేంద్రమంత్రులు పాల్గొన్నారు.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. బీజేపీ ఏకంగా 207 స్థానాల్లో ఘన విజయం సాధించింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 80 సీట్లకే పరిమితం అయింది. సువేందు అధికారి రెండు చోట్ల పోటీ చేశారు. నందిగ్రామ్, భవానీపూర్ నుంచి ఆయన బరిలో నిలిచారు.భవానీపూర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావ టం విశేషం. సువేందు భవానీపూర్‌లో మమతాపై 15 వేల ఓట్ల మెజార్టీతో గెలుపు సాధించారు.

No comments:
Post a Comment