రాజకీయాలకు బొత్స గుడ్ బై...
AP: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయాలకు గుడ్బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల తర్వాత అనారోగ్యానికి గురైన ఆయన, ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు కుప్పకూలిపోయారు. ఈ నేపథ్యంలో, ఆయన శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పదవి నుంచి తప్పుకుంటారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కుటుంబ సభ్యులు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దీనిపై సీనియర్లతోచర్చించనున్నారని సమాచారం.

No comments:
Post a Comment