🔴
Loading latest posts...

Thursday, May 7, 2026

ఆలయాన్ని విధ్వంసం చేసిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలీ : అనిల్ కుమార్ నాయక్...

ఆలయాన్ని విధ్వంసం చేసిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలీ : 

ఖానాపురం అశోక్ నగర్ గ్రామంలో విధ్వంసమైన కాకతీలు నాటి చారిత్రక ఆలయాన్ని పరిశీలించిన తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు డా||బోడా అనిల్ కుమార్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూతక్షణమే స్థానిక గౌరవ ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేస్తున్నాముఎమ్మెల్యే,కలెక్టర్,ప్రభుత్వo స్పందించి ఆలయ పునర్ నిర్మాణం చేసే విధంగా పాటుపడాలి లేనిచో రాష్ట్రవ్యాప్త ఆందోళనకి దిగుతాముచారిత్రక ఆలయాన్ని విధ్వంసం చేసిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలీఆలయ కూల్చివేతపైన ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నవిప్రజల మనోభావాలు దెబ్బతినేవిధంగా ఆలయ విధ్వంసం జరిగిందిచరిత్రహీనులు మాత్రమే ఈ లాంటి పనులు చేస్తారుకాకతీయుల చరిత్ర పైన కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది కాకతీయుల కళాతోరణాన్ని తొలగించాలని ముఖ్యమంత్రి ప్రయత్నం చేశారు నేడు కాకతీయులు కట్టిన చారిత్రక ఆలయాన్ని తొలగించారుఅభివృద్ధి పేరుతో చారిత్రక ఆలయాన్ని విధ్వంసం చేయడం అవివేకం  కాకతీయుల చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాంతానికి వేల సంవత్సర చారిత్రక  గుర్తింపును ఇచ్చింది. పాకాల సరస్సు కలిగిన చారిత్రక ప్రాంతంలో ఆలయాన్ని ఈరోజు విద్వంసం చేశారు. 1213 సంవత్సరంలో నిర్మించిన పురాతనమైన కాకతీయ కళ సంపద కలిగిన ఆలయాన్ని కూల్చి వేస్తుంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తున్నారు.ఈ ఆలయాన్ని అనేక ప్రభుత్వాలు గుర్తించినవి , గతంలో ఈ స్థలాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించాలని ఉన్న చారిత్రక ఆలయం ఉన్నందున ఉపయోగించలేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాంతంలో అనుమతులు ఇవ్వడానికి ఎలాంటి అధికారాలు లేవు.కాంట్రాక్టర్ లాభాల కోసం స్థానిక నాయకుల కమిషన్ల కోసం చరిత్ర కలిగిన ప్రాంతాన్ని విధ్వంసం చేయవద్దు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు వెంటనే దీనిపైన విచారణ చేపట్టాలి ఈ ఆలయం నుండి ఖిల్లా వరంగల్ వరకు  సోరంగా మార్గాలు ఉండేవని చరిత్ర చెబుతున్నది బాధ్యుల పైన తక్షణ చర్యలు తీసుకోవాలి ,వారిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నర్సంపేట నాయకులు వినోద్ మహేందర్ కిరణ్ నరేష్ బన్నీ నరసింహ మంగ్య మహేష్ అభిరామ్ రాజేష్ తేజు జంపన్న నిమ్మల రమేష్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు... నేరేడుచర్లలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సైదిరెడ్డి గారిని బూర్గులతండా కాంగ్రెస్ గ్రామ...