బండి భగీరథ్ పైన తక్షణమే విచారణ జరపాలి : సీఎం రేవంత్..
బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ్ పైన నమోదు కేసుపైన తక్షణమే విచారణ మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ను ఆదేశించారు. 8 వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ ని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.. కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వివరించారు. ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని ముఖ్యమంత్రి కి డీజీపీ వివరించారు.కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీం లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీ ని ఆదేశించారు..

No comments:
Post a Comment