బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చలు...
తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 12న ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, మండలి, శాసనసభాపక్ష ఉపనాయకులతో సమావేశం కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఇన్‌చార్జిల నియామకం, ఇతర రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నట్లు సమాచారం. రానున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీ వ్యూహాలపై కూడా చర్చలు జరిగే అవకాశముంది.

No comments:
Post a Comment