మైనర్ బాలిక ఘటనపై నేరేడుచర్లలో నిరసన...
నేరేడుచర్ల చౌరస్తాలో బీఆర్‌ఎస్‌వై విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి బండి సాయి భగీరథను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. ఈ సందర్భంగా బండి సంజయ్, భగీరథకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చిత్రపటాలను దహనం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు.

No comments:
Post a Comment