వికలాంగుల హక్కుల కోసం ప్రభుత్వానికి డిమాండ్...
నేరేడుచర్లలో జరిగిన వివాహ వేడుకల్లో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల వివాహ ప్రోత్సాహకాన్ని పెంచడం, పెన్షన్లు, ఉద్యోగ అవకాశాలు, ఉచిత ప్రయాణ సౌకర్యం వంటి హామీలను అమలు చేయాలని కోరారు. సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. లేనిపక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

No comments:
Post a Comment