గుంతకల్లు, గిద్దలూరు, మార్కాపురం రోడ్డు మధ్య కొత్త రైలు
ఈనెల 13వ తేదీ నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుంతకల్లు, మార్కాపురం రోడ్డు రైల్వే స్టేషన్ మార్గాల మధ్య ప్రతిరోజు ప్యాసింజర్ రైలు నడిపేందుకు సిద్ధమయింది. 57407/ 57408 నంబర్ తో నడిచే ఈ రైలు గుంతకల్లు, మద్దికేర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లి, జగ్గంబట్ల కృష్ణాపురం, కంభ, తర్లుపాడు రైల్వే స్టేషన్లలో ఆగుతూ మార్కాపురం రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది. ప్రతిరోజు గుంతకల్లులో సాయంత్రం 5:30 కి బయలుదేరి రాత్రి 11:30 కి మార్కాపురం చేరుకుంటుంది. మార్కాపురం రోడ్డులో ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 నిమిషాలకు బయలుదేరి ఉదయం 10: 30 నిమిషాలకు గుంతకల్లు చేరుతుంది.

No comments:
Post a Comment